వాళ్ళు పెద్ద బోటులోంచి బయటకు రాగానే , మల్లికార్జునకు ఫోన్ చేసాను ట్రూప్స్ తో రమ్మని. వాలు ఇద్దరూ మా దగ్గరికి రాగానే , బిల్డింగ్ వెనుక నుంచి ఓ పదిమంది కమెండోస్ తో వచ్చి వాళ్ళను చుట్టు ముట్టాడు మల్లికార్జున
వాళ్ళ వెనుకనే కొద్ది మంది లీడింగ్ ప్రెస్ రిపోర్టర్లు వచ్చి అక్కడ జరుగుతున్నది రికార్డ్ చేయసాగారు.
“వీళ్ళను ఎవరు తీసుకోని వచ్చారు సార్ ” అన్నాను పొలిసు ఆఫీసర్ వైపు చూసి
“మంత్రి గారి కూతురు, మాకు తెలీకుండా వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించింది”
“సరే అయితే , జరిగింది అంతా వాళ్లకు చెప్పక తప్పాదు , ముందు వాళ్ళను అరెస్ట్ చేయండి , లోపల వేరే పెద్ద షిప్ ఉంది అందులో వీళ్ళకు సపోర్ట్ చేసే విదేశీ శక్తులు ఆ షిప్ లో ఉన్నాయి ” అంటూ మల్లికార్జునకు చెప్పాను.
వచ్చిన వాళ్ళలో ఒకరు అటవీ శాఖా మంత్రి , అదే మా అందరికి ఆశ్చర్య కరమైన విషయం, రెండో వాడు ఓ చిన్న సైజు గుండా సిటీ లో , వాళ్ళను ఇద్దరినీ అరెస్ట్ చేసి వాళ్ళు వచ్చిన పడవలో వాళ్లతో పాటు కొంత మంది కమెండోలు రాగా సముద్రం లోకి వెళ్ళాము.
ఓ 10 కిమీ దూరంలో ఓ కార్గో షిప్ లంగరు వేయబడి వుంది. మేము ఆ షిప్ లో వెళ్లి ఆ షిప్ కెప్టెన్ ను మిగిలిన సిబ్బందిని వడ్డుకు తీసుకోని వచ్చాము. వచ్చిన కమెండోస్ సహాయంతో అందరికి బేడీలు వేసి అమ్మాయిలు ఉన్న చోటకు తీసుకోని వచ్చాము.
వాళ్ళు బయటకు రాగానే మల్లి కార్జున దగ్గరున్న పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి, వాళ్లకు విషయం అంతా చెప్పి రెండు వ్యాన్ లు మెయిన్ రోడ్డు మీదకు రమ్మని చెప్పి , హెలికాప్టర్ సాయంతో అందరిని రోడ్డు మీదకు చేర్చేసాడు. మంగికి మల్లికార్జున దగ్గర ఉన్న డబ్బుతో పాటు నా దగ్గరున్న మొత్తాన్ని తన కిచ్చి , ఏదైనా అవసరం అయితే టౌన్ కు వచ్చి నా నెంబర్ కు ఫోన్ చేస్తే నేను సహాయం చేయగలను అని చెప్పి తనను గూడెం కు పంపించాను.
విలేఖరులు , దీపాళీ , సాహితి, ఇంకో మంత్రి కూతురు మాతో హెలికాప్టర్ లో హైదరాబాదుకు రాగా , మల్లికార్జున , కామెండోస్ తో షిప్ లోని వాళ్లను బందీలు గా చేసి మిగిలిన అమ్మాయిలను తీసుకోని రోడ్డు మార్గం ద్వారా సిటికి బయలు దేరారు.
========================================================================================
మేము వెళ్ళే సరికి స్టేషన్ లో అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్, సిటి లోని పెద్ద పెద్ద పొలిసు ఆఫీసర్స్ అంతా అక్కడే ఉన్నారు , కిడ్నాప్ అయిన వాళ్ళల్లో మినిస్టర్ కూతురు కూడా ఉండడం వలన ఆ మంత్రి కూడా రావడం వలన ఆయనతో వచ్చిన సెక్యూరిటీ కూడా అక్కడ వుంది.
పోలీసులు వాళ్ళ ఫార్మాలిటీస్ కానిచ్చిన తరువాత , అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ తో వెళ్లి పోయారు. ఫైనాన్స్ మంత్రి గారి కూతురు పేరు శ్రీలత. మల్లికార్జున నన్ను తీసుకెళ్లి తనకు పరిచయం చేసి , జరిగింది అంతా ఆయనకు వివరించాడు. అయన నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ
“థేంక్స్ యంగ్ మ్యాన్ , పోలీసులు ఎవ్వరు చెయ్యిలేని పని నువ్వు చేయగలిగావు, నేను మంత్రి ని అయ్యి ఉంది కూడా నీ అంత ఫాస్ట్ గా రి యాక్ట్ కాలేక పోయా , మా అమ్మాయిని రక్షించి నందుకు చాలా థేంక్స్ అబ్బాయి” అన్నాడు
“అదేం లేదు సార్, ఎదో అదృష్టం అలా కలిసి వచ్చింది అంతే ,టైం కి మల్లికార్జున గారు రాబట్టి వాళ్లను పట్టుకో కలిగారు లేకుంటే మొదటికి మోసం వచ్చేది , అంతా వారే నండి నాదెం లేదు”
“ఆ ,మల్లికార్జున కు ప్రమోషన్ కు రెకమెండ్ చేస్తా లే , నీకు ఎం కావాలో చెప్పు నా చేతనైంది చేస్తాను”
“మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉంటే ఆమెను రక్షించడానికి వెళ్లాను కానీ ప్రత్యేకంగా నేను చేసింది ఏమీ లేదు , అవసరం వచ్చినప్పుడు మీ సహాయం తీసుకుంటా లెండి సర్ , ప్రస్తుతానికి నాకే మి అవసరం లేదు , మీరు సెలవిస్తే నేను ఇంటికి వెళతా ను” అంటు వాళ్ళకు బాయ్ చెప్పి బయటకు వచ్చాను.
నా వెనుకే శ్రీలత బయటకు వచ్చి “థేంక్స్ శివా, I like యువర్ గట్స్ , థేంక్స్ ఒన్స్ అగైన్ , we విల్ మీట్ ఒన్స్ అగైన్ ” అంటు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది.
బయట నా కోసం ఎదురు చూస్తున్న దీపాలి , సాహితి మాత్రమే మిగిలి ఉన్నారు.
“మీ నాన్న రాలేదా ఇంకా ” అన్నాను సాహితీ వైపు చూస్తూ
“రాలేదు , నేను ఓ ఫోన్ చేసుకోవచ్చా ” అంది నా వైపు చూస్తూ
నా ఫోన్ తన చేతికి ఇచ్చి ఫోన్ చేసుకోమన్నాను . తను వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పి , ఇప్పుడు తను స్టేషన్ లో ఉందని చెప్పింది. ఫోన్ నా చెతి కి ఇచ్చి ,”మా నాన్న మాట్లాడతాడు అంట ” అంటు నా చేతికి ఫోన్ ఇచ్చింది
“బాబు , అది ఇప్పుడు బాగా భయపడి ఉంది , దాన్ని హాస్టల్ కు పంపకుండా ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండని యవా , నేను బయలు దేరి వస్తున్నా రేపు పొద్దున్నే వచ్చి నేను తీసుకొని పోతాను.”
“సరే నండి , నాకు తెలిసిన వారి దగ్గర ఉంచు తాను తను క్షేమంగా ఉంటుంది , మీరు పొద్దున్నే తీరికగా రండి మరేం ఫరవాలేదు.” అంటు ఫోన్ పెట్టాను.
మేము ఫోన్ మాట్లాడుతుండగా నీరజా, రుపాలి వాళ్ళ నాన్నతో కలిసి వచ్చారు.
“థేంక్స్ అండి ” అంటు రూపాలి నా దగ్గరకు వచ్చి నా చేతిని తన చేతి లోకి తీసుకొంది.
“నేనేం చేసింది ఎ మీ లేదు గానీ, మీ దీపాలి చేసిన ధైర్యం ముందు నాది ఏపాటి”
“నేను చేసింది ఏముంది అంతా మీరు చెప్పినట్లు చేసాం అంతే గదా ” అంది దీపాలి
“ఇప్పుడు, మనం ఒకరిని ఒకరు పొగుడు కోవడం అవసరమా , పదండి ఇంటికి వెళ్దాం” అంటు నీరజా బయటకు నడిచింది.
“నీరజా , తనను ఈ రాత్రికి మీ ఇంటికి తీసుకోని వెళ్ళగల వా , రేపు ఉదయం వాళ్ళ నాన్న వచ్చి తనను తీసుకోని వెల తాడు “
“నో ప్రాబ్లమే ” అంటు తను వచ్చిన కారులో సాహితిని తీసుకోని బయలు దేరింది.
“నన్ను కూడా ఇంట్లో దింపి ఆ తరువాత వెళ్ళొచ్చు గా ” అన్నాను నీరజ వైపు తిరిగి.
“పద వెళ్దాం ” అంటు మేము ముగ్గురు తన కారులో బయలు దే రాము.
కారులో కుచోగానే , అంతవరకు కామ్ గా ఉన్న సాహితీ “థేంక్స్ అన్నా ,నీవు లేకపోతే వాళ్ళు మమ్మల్ని వాళ్ళకు అమ్ మేసే వాళ్ళు ” అంది
“పర వా లేదులే మీ నాన్నకు తెలియలేదు , లేకుంటే మీ నాన్న వచ్చి రక్షించే వాడు లే ” అంటు ఉండగా మాకారు ట్రాఫిక్ లో ఆగిపోయింది. మా ముందు కొద్ది మంది జనాలు గుంపుగా ఉండడం వలన ట్రాఫిక్ ఆగిపోయింది.
“ఉండు నేను చూసి వస్తా ఏమీ జరిగింది అంటు” నేను కింద కు జరిగి ఆ గుంపు దగ్గరకు వెళ్లాను. రోడ్డుకు అనుకోని ఉన్న బైక్ స్టాండ్ కు పక్కన ఓ పెద్దాయన కింద పడి ఉన్నాడు కానీ ఎవ్వరు అతన్ని గురించి పట్టిచ్చుకోవడం లేదు.
“ఏమైంది” అన్న నా ప్రశ్నకు ఎవ్వరి వైపు నుంచి సమాధానం రాలేదు. ఆయన అలాగా ఎంత సేపటి నుంచి ఉన్నారో తెలియడం లేదు. వెంటనే అయన దగ్గరకు వెళ్లి నా చేతుల్లో ఎత్తుకొని మా కారు దగ్గరి కి వచ్చాను.
నేను రావడం చూసి సాహితి వెనుక డోరు ఓపెన్ చేసి అతని తల వైపు పట్టుకొని సరిగా సీటు మీద పడుకో పెట్టుకొంది. నేను డోరు వేయగానే నీరజా కారును స్పీడుగా ముందుకు పోనిచ్చింది , ఆ దారిలో కనబడిన మొట్టమొదటి ఆసుపత్రి దగ్గర ఆపేసింది. కారు అక్కడ ఆగగానే నేను వెళ్లి అక్కడున్న స్త్రేచ్చార్ తెచ్చి అతన్ని కారు లోంచి స్త్రేచేర్ లోకి మార్చే లోపుల నీరజా లోపలికి వెళ్లి డాక్టర్ ను వెంటబెట్టు కొచ్చింది.
డాక్టర్ అతన్ని చూసి , ఇతనికి హై BP ఉంది , కొద్ది సేపు హాస్పిటల్ లో ఉంచితే సరిపోతుంది అంటూ లోపలి తీసుకోని వెల్లి ఓ సేలిన్ బాటిల్ ఎక్కించి అందులోకే ఏవో మెడిసిన్ ఇంజెక్ట్ చేసాడు.
మీరు వెళ్ళండి , నేను తనకు మెలకువ రాగానే వెళ్లి పోతాను అని చెప్పి వాళ్ళ ఇద్దరినీ పంపించి వేసాను. అతని గురించి వాళ్ళ వాళ్లతో ఏమైనా చెపుదాము అంటే అతని ఫోన్ లాక్ చేసి ఉంది. ఎలా అని ఆలోచిస్తుంటే అతనికి మెలకువ వచ్చింది.
Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12