ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు
అవసరం లేని ఫర్నిచర్ OLX లో యాడ్ ద్వారా అమ్మేశాడు శ్రీరామ్. రెండు రోజుల్లో కావ్య వాళ్ళు వస్తారనగా, ఆర్డర్ చేసిన కిటికీ కర్టెన్స్, డబల్ రాడ్స్ తో ఫిట్ చేసి తగిలించి వెళ్లిపోయారు. మరుసటి రోజు వాళ్ళు ఆర్డర్ చేసిన ఫర్నిచర్ ఇంటికి డెలివరీ వచ్చింది. వాళ్ళ్లే అన్ని మంచాలు అసెంబ్లీ చేసి, చక్కగా అమర్చి వెళ్లిపోయారు. కొత్త కర్టెన్స్, ఫర్నిచర్ తో అపార్ట్మెంట్ కి ఒక కొత్త కళ వచ్చింది. ముహూర్తం ముందు రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రెండు కార్, వాన్ లలో బయలు దేరి హైదరాబాద్ చేరుకొన్నారు. ఆ రోజు రాత్రికి హోటల్ లో బస చేశారు. కొంచెం సేపు మరుసటి రోజు ప్రోగ్రాం డిస్కస్ చేసుకున్న తరువాత, కావ్య శ్రీరామ్ చాలా సేపు మాట్లాడు కొని, కొత్త కాపురం గురించి కలలు కంటూ ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.