ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 16
ఆదివారం పొద్దున్న టిఫిన్ చేసి తొమ్మిది గంటలకు శ్రీరామ్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరబోతుంటే సౌమ్య నుంచి కాల్ వచ్చింది, ఫ్లైట్ డిలే అయిందని. దాంతోనే ఇంట్లోనే టీవీ చూస్తూ ఎదురు చూడసాగాడు శ్రీరామ్. మళ్ళా 11 గంటలకు కావ్యకు కాల్ చేసి చెప్పింది సౌమ్య, ఫ్లైట్ ఆలస్యం అవుతుంది, మీరు భోజనం చేసేయ్యండని, తను క్యాబ్ లో వచ్చేస్తానని. అలా చెప్పటంతో పన్నెండున్నరకల్లా భోజనం చేశారు ఇద్దరూ. కాసేపు పడుకుందామని బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. తను వెల్దామా అనుకొంది, కానీ చెల్లి అసలే ఆవురావురుమని వస్తోంది అని మనసు మార్చుకొంది. కావ్య గురించి ఎదురు చూసి నిద్రలోకి జారుకున్నాడు శ్రీరామ్. బాబుకు పాలిచ్చి గెస్ట్ బెడ్ రూమ్ లో పడుకోబెట్టి చెల్లి కోసం ఎదురు చూడసాగింది.