నేను కూడా చేతిలో ఉన్న కోకాకోలా కొంచెం కొంచెంగా తాగుతున్నాను. నాకు కూల్ డ్రింకులు తాగటం పెద్దగా అలవాటు లేదు. అందులోనూ కోలా ఫ్లేవర్ అసలు లేదు. గుటక వేస్తుంటే ఘాటుగా వగరుగా అనిపించింది.
“ఏంటీ ఆలోచిస్తున్నావ్!? తొందరగా రా అన్నయ్య! కింద ఒకటే కొట్టేసుకుంటుంది.” అంది నేహ వాడి చెయ్యి పట్టి లాగుతూ. పిన్ని సంగతి సరే, అమ్మకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ, తన బైక్ ఎక్కాడు రాజు. నేహ అతని వెనక కూర్చోబోతుండగా, ఒక అమ్మాయి “ఏయ్ నేహా..ఆగు..” అంటూ పరుగెత్తుకు వచ్చింది. నేహ ‘ఏమిటీ?’ అన్నట్టు చూసింది. “నిత్య రూంకి వెళుతున్నావంటగా, నేనూ వస్తాను. కొన్ని బుక్స్ తీసుకోవాలి.” అంది ఆమె. అప్పుడు నేహ మొహంలో కదిలిన భావాలు చూసి నవ్వొచ్చినా, ఆమె ఫీలవుతుందని బలవంతంగా లోపలే నొక్కేసుకున్నాడు రాజు. నేహ అతని వైపు చూసి, “ఓకే అన్నయ్య..మళ్ళీ కలుద్దాం.” అని నీరసంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే “హమ్మయ్య..” అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి, వెళ్ళబోతూ ఆగిపోయాడు. “ఎటు వెళ్ళాలీ!? అమ్మ దగ్గరకా, పిన్ని దగ్గరకా!?”
అప్పుడే స్నానంచేసి బాత్రూంలోంచి బయటకొస్తూనే అమ్మా లగేజ్ సర్దడం అయిపోయిందా అంటూ గట్టిగా అరిచాడు రఘు.ఆ అరుపులు విన్న సుధ అయిపోయింది నీదే ఆలస్యం అంటూ రఘు గదిలోకొచ్చింది.ఊరికి వెల్లే సంగతి తెలిసికూడా ఇంత లేటేంటిరా తొందరగా కానీ నేనెల్లి టిఫిన్ ప్యాక్ చేస్తా అనుకుంటూ వంట గదిలోకి వెల్లపోయింది.సీనుగాడు ఎప్పుడూ ఇంతే ఎప్పుడన్నా పని ఉన్నప్పుడే ఎక్కడికి వెలతాడో తెలియదు అంటూ ఫోన్ చేయసాగాడు.ఫోన్ రింగయింది కానీ ఎత్తడం లేదు.అప్పుడే వస్తున్న సీనుని చూసి ఏంట్రా వాడికి ట్రైన్ టైం అవుతుంది ఇప్పుడా వచ్చేది వాన్ని తొందరగా రమ్మను అని చెబుతున్న సుధకు ఏదో చెప్పబోయిన వాడు ఆగిపోయి ….సరే అంటీ అంటూ రఘు గదిలోకి వెళ్లాడు.