ప్రయాణం
కజిన్ పెళ్ళికి వచ్చి నెల రోజులు అయినా స్వప్న వాళ్ళ ఆయన సెలవు లేదు అని వచ్చి తీసుకు వేల్లకపోవడంతో చూసి చూసి ఇంకా లాభం లేదు అని తనే ప్రయాణం పెట్టుకుంది. చంకలో 1 సంవత్సరం పాపతో కష్టమే అయినా తప్పలేదు. అమ్మ నాన్న చెల్లి ఎయిర్ పోర్ట్ కి వచ్చి దింపి వెళ్ళారు. చెక్ ఇన్ పూర్తి అయ్యాక ఒక పక్కకి కూర్చొని పాపకు పాల పొడి కలిపి సీసా ఇచ్చి వొళ్ళు పెట్టుకొని చుట్టు చూసింది. అందరు టిఫిన్ తినడం లో షాపింగ్ లో బిజీ గా ఉన్నారు. ఒక 50 ఏళ్ళ జంట తన వైపు పాప వైపు చూస్తూ నవ్వుతున్నారు. తను కూడా చిన్నగా నవ్వి అటు ఇటు చూసింది.