“ఏమైంది నాకు , నేను ఎక్కడ ఉన్నాను ” అనే స్టాండర్డ్ డైలాగ్ అతని నోటి నుంచి వచ్చింది. నేను చెప్పే లోపలే అక్కడికి వచ్చిన నర్సు అంతా విడమర్చి చెప్పేసింది. తను రోడ్డు మీద పడి ఉంటే నా ఫ్రెండ్స్ తో తనను అక్కడ చేర్పించానని , తనకు మెలకువ వస్తే తన వాళ్ళకు తనను అప్ప చెప్పడం కోసం కూచున్నాను అని చెప్పింది.
అంతా విన్న తరువాత , “థేంక్స్ బాబు , ఇప్పుడు నేను బాగున్నాను, ఫరవాలేదు మా ఆవిడ ను పిలిపిస్తాను మీరు వెళ్ళండి ” అంటు అయన పేరు శాస్త్రి అని చెప్పాడు. తన బైక్ పార్క్ చేసి బ్యాంక్ లోకి వేలదా మను కొంటుండగా కళ్ళు తిరిగి పడిపోయాడంట తన బైక్ అక్కడే పార్కింగ్ లో ఉంది అన్నాడు.
“మీ వాళ్ళు వచ్చేంతవరకు కావాలంటే ఉంటాను “
“ఫరవాలేదు లే బాబు ఎప్పటి నుంచి ఉన్నావో ఇక్కడ , నాకు బాగానే ఉంది”
“సరే సర్ నేను వెళతా ను” అంటు ఇంటికి వెళ్లాను.
“ఏంటి రా ఇన్ని రోజులు వెళ్లావు ” అంది అమ్మ
“ఆఫీస్ పని మీద వెల్లా నమ్మా , అందుకే ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది ” అన్నాను.
“నువ్వు లేనప్పుడు మన పక్కింటి ఓనర్స్ వాళ్ళు వచ్చారు , ఆయనకు ఇక్కడికి transfer అయ్యింది అని చెప్పాను కదా , మొన్న వచ్చారు , ఇప్పుడే ఆవిడ బయటకు వెళ్ళింది.”
“సరేలేమ్మా , నేను స్నానం చేసి వస్తా , అన్నం పెట్టు ఆకలి వేస్తుంది , రెండు రోజులు అయ్యింది సరిగ్గా తిండి తిని”
“మీ ఆఫీసు వాళ్ళు అన్నం పెట్టారా ఏంటి “
“పెడతారు లే, నేను వెళ్ళిన చోట మన ఫుడ్ లేదులే ” అంటు బాత్రూం కు వెళ్లాను. ఫ్రెష్ అయ్యి వచ్చే కొద్ది ఫోన్ లో శాంతా ఉంది. ఎక్కడికి వెళ్లి పోయావు రెండు రోజుల నుంచి ఫోన్ లో లేవు. పని మీద వెళ్ళిన రెండు రోజులు నా ఒరిజినల్ సిం తీసేసి వేరే సిం వేసుకున్నా, ఆ నంబరు నీరజ కు , మల్లి కార్డునకు , దీపాలి వాళ్ళ నాన్నకు తప్ప వేరే ఎవరికీ తెలియదు. అందువలన తనకు ఫోన్ లో దొరక లేదు.
“చిన్న ప్రాజెక్ట్ పని మీద బయటకు వెళ్లాను అందుకే ఫోన్ అందుబాటులో లేదు”
“ఫోన్ సిగ్నల్ కూడా రాని ప్లేస్ లో ఏమీ IT ప్రాజెక్ట్స్ ఉన్నాయి”
“రేపు కలిసినప్పుడు చెప్తాలే, అది ఫోన్ లో చెప్పే ది కాదు” అంటు రేపు ఎక్కడ కలవాలో చెప్పి ఫోన్ పెట్టాను.
Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12