ఇంటి యజమాని!
రమేష్ హైదరాబాద్ లో కొత్తగా ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు. ఊరు గాని ఊరు. షిఫ్టుల్లో పని. ఒక రెండు రోజులు తిరిగి ఒక సింగిల్ రూం అద్దెకు తీసుకున్నాడు. రోజు తెల్లవారుజామునే వెళ్ళడం, సాయంత్రానికల్లా రావడం. మరో నెల నైట్ డ్యూటీలు. ముందు కొన్ని రోజులు హోటళ్ళలో తిన్నాడు గానీ సరి పడక, స్వంతంగా వంట చేసుకోవడం మొదలెట్టాడు. మార్నింగ్ డ్యూటీలు ఉన్నపుడు అంట్లు కడగటం ఇబ్బంది అయ్యేది. జీతం బాగానే ఉంది గాబట్టి ఒక పని మనిషిని పెట్టుకుంటే మంచిదనిపించింది. ఒక రోజు ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాడు, పని మనిషి సంగతి అడుగుదామని. ఇంటి ఓనర్ కి చిన్న హోటల్ ఉంది. అతనూ ఉదయాన్నే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది. ‘ఆంటీ, ఒక పని మనిషి కావాలి’ అన్నాడు రమేష్.