ఆ రోజు రాత్రి, మా వారు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు కాని నేను ముభావంగానే ఉన్నాను. నాకు ఒంట్లో నలత గా ఉందని అటు తిరిగి పడుకున్నానే గాని నాకు నిద్ర పట్టడం లేదు . మధ్యాహ్నం విషయమే గుర్తుకొస్తూ ఉంది. రేపు ఏమవుతుంది .. అన్నయ్య రేపు ఎలాగు వస్తాడు వాడి మొహం ఎలా చూడ్డం.. నన్ను చీ వాట్లు పెడతాడా !! ఏమో నన్ను చీవాట్లు పెట్టి నా నేను ఊరుకుంటానా తను వెంట పెట్టు కొచ్చినావిడను గురించి అడగ నా !! అను కుంటూ సమాదాన పరచుకున్నా.