రాత్రి భోజనాలు చేస్తూ “పెద్దోడు ఇంకా రాలేదేంటి….”అన్నాడు శరత్ వాళ్ళ నాన్న. “ఆ ఇప్పుడే ఎక్కడ వొస్తాడు…ఎంతైనా నీ కొడుకు కదా…”అంది భర్తతో. “వాడి గురించి అడుగుతుంటే మధ్యలో నన్ను ఎందుకు లాగుతావు…”అన్నాడు భార్యతో. మహి, శరత్ లు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకున్నారు.